తెలంగాణ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ తొలిసారి సభలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాలు అధికార పక్షానికి సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమే హవా అనేలా కొనసాగింది. అయితే, కేసీఆర్ అనుభవజ్ఞత, పదేళ్ల సీఎంగా ఉండటం, ఉద్యమ నేతగా పోరాడటం – ఇవన్నీ ఈ సమావేశాల్లో అధికార పార్టీకి కఠిన పరీక్షగా మారవచ్చు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రస్తావించే అంశాలు సభను హీటెక్కించే అవకాశముంది.
గత కొన్ని నెలలుగా ప్యాసివ్‌గా ఉన్న కేసీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను చైతన్యపరిచేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన, అసెంబ్లీలో తమ వ్యూహాన్ని స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ఎంట్రీతో అసెంబ్లీలో హాట్ డిబేట్లు జరగనున్నాయనే అంచనాలు ఉన్నాయి. అధికార పక్షానికి ఇకపై ప్రతి అంశంపై తగిన సమాధానం చెప్పక తప్పదన్న ఒత్తిడి పెరగనుంది.