హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం వరకు వరకు సుమారు 8 వేల వరకు నమోదైన కేసులు ఇప్పుడు 5 వేలు మాత్రమే నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కొత్త కరోనా కేసులు 5,186గా ఉండగా, 38 మంది మరణించారు.
అలాగే గడచిన 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ కరోనా నుంది కోలుకుని ఆసుపత్రి నుంది విడుదల అయ్యారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాయంత్రం వేళ కరోనా బులెటిన్ విడుదల చేయడం మొదలుపెట్టింది. నిన్నటి వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు.
ఇవాళ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఒక్క రోజులోనే 69,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షల సంఖ్య 1,35,57,646. అలానే కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,21,219గా ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 68,462.
కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,92,385. కరోనతో మొత్తం మృతుల సంఖ్య 2,704కు చేరుకుంది. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నుండి ఈ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.