హైదరాబాద్: పదవ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ సస్పెన్స్ గా ఉండగా, తెలంగాణ హైకోర్టు జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి జిల్లాలో పరీక్షలను వాయిదా వేసి, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ రెడ్ జోన్ కింద ఉన్నందున, తరువాతి తేదీలలో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు, ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, రంగారెడ్డి జిల్లాలోని జిహెచ్‌ఎంసిలో, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది, మరియు సప్లిమెంటరీకి హాజరయ్యే విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు తీర్పుకు ముందు, అన్ని జిల్లాలలో పరీక్షలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. దీనిపై కోర్టు ప్రభుత్వం కు ఎదురు ప్రశ్నలు వేసింది. “పరీక్షల మధ్యలో ఒక విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? కంటెయిన్మెంట్ జోన్లో పరీక్షా కేంద్రం పడితే ఎలా? మేము రిస్క్ తీసుకోలేము. పరీక్షల కంటే, విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమైనవి” అని కోర్టు తెలిపింది.
కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రం మళ్లీ తయారు చేయాల్సిన సమస్యలు వస్తాయని ప్రభుత్వం వాదించింది. దీనికి కోర్టు, విద్యార్థుల జీవితాలు ముఖ్యమైనవా? లేక సాంకేతిక అంశాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ప్రతిపాదనలను అంగీకరించింది.