తెలంగాణ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా మరియు దక్షిణ కొరియా పర్యటనలు ముగించుకొని గురువారం ఉదయం తెలంగాణకు చేరుకున్నారు.
ఈ పర్యటనలో ఆయన 19 కంపెనీలతో సంప్రదింపులు జరపడం ద్వారా మొత్తం రూ.31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, దీని ద్వారా 30,750 కొత్త ఉద్యోగాల సృష్టి అవుతుంది.
విదేశీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు.
ఆగస్టు 15న, ఉదయం 8.30 గంటలకు గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అదే రోజు ఉదయం 9.20 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో సైనికుల స్మారక స్థూపానికి నివాళి అర్పించనున్నారు.
ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుని జాతీయ జెండాను ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఢిల్లీ పర్యటన
ఈ నెల 17న, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఏఐసీసీ మీటింగ్ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం కోసం కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మరియు ఎమ్మెల్యేల చేరికల అంశాలపై ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరపడం జరుగుతుందని సమాచారం.
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.