fbpx
Friday, October 18, 2024
HomeTelanganaరేపటి నుండి తెలంగాణ డిఎస్సీ పరీక్షలు!

రేపటి నుండి తెలంగాణ డిఎస్సీ పరీక్షలు!

TELANGANA-DSC-EXAMINATIONS-FROM-TOMORROW

హైదరాబాద్: తెలంగాణ డిఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షలు గురువారం నుండి మొదలు కానున్నాయి. నిరుద్యోగులు పరీక్షను వాయిదా వేయాలని నిరసనలు తెల్పుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహించడానికి మొగ్గు చూపింది.

కాగా చాలా రోజుల నుండి టెట్ నిర్వహణ మరియు డీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇంకా సమయం కావాలని ఉద్యోగార్థులు ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే, పరీక్ష నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.

అలాగే ఈ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. 11,062 పోస్టుల భర్తీకి గాను 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 16వ తేదీ సాయంత్రానికి 2,40,727 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు, జులై 18వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాలను అధికారులు సన్నద్ధం చేశారు. డీఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో జరుతాయి. హాల్ టిక్కెట్లలో పలు తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి చేరడంతో వాటిని సరి చేసి ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular