తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన టాలీవుడ్ ప్రముఖులతో ఈ రోజు ప్రత్యేక సమావేశం జరిగింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య సయోధ్య కోసం ఈ సమావేశం నిర్వహించారు.
దిల్ రాజు ఆధ్వర్యంలో నాగార్జున, సాయి తేజ్, వరుణ్ తేజ్, నితిన్, కళ్యాణ్ రామ్, ఇతర ప్రముఖ నటులు, నిర్మాతలు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో కులగణన సర్వేల్లో సినీ ప్రముఖుల భాగస్వామ్యం, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, సినిమాలకు ముందు సోషల్ మెసేజ్ వీడియోల ప్రదర్శన వంటి అంశాలు ఉన్నాయి.
బెనిఫిట్ షోలు రద్దు నిర్ణయంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. టికెట్ పై సెస్సు విధించడం, సామాజిక స్పృహ కార్యక్రమాలు నిర్వహించడం కూడా చర్చకు వచ్చాయి.
ఇరువర్గాల మధ్య సంయమనం, సహకారం పెంపొందించుకోవడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
రాబోయే సంక్రాంతి రీలీజ్‌లకు సంబంధించి టికెట్ ధరలు, థియేటర్ షోలపై ప్రభుత్వం మరింత సవరణలు చేస్తుందా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని దిల్ రాజు తెలిపారు.