హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ దేశమంతా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ గడచిన 24 గంటల్లొ 75,289 మందికి కరోనా పరీక్షలు చేయగా వాటిలో 4,801 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 32 మంది కరోనాతో మృతి చెందారు. దీనికి సంబంధించి తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ఇవాళ సాయంత్రం విడుదల చేసింది.
ఇవాల కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కావడం జరిగింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తదుపరి మేడ్చల్ జిల్లాలో 327, రంగారెడ్డి జిల్లాలో 325 కేసులు వెలుగులోకి వచ్చాయి.
కాగా గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 7,430 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఖ్యతో కలిపి ఇప్పటివరకు 4,44,049 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 2,803 కు చేరుకుంది. ప్రస్తుతం 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా కట్టడికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రేపటి నుంచి లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో కరోనా ఉధృతికి కట్టడి ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.