హైదరాబాద్: అతడికి మరణశిక్షే సరైనది అని ఒక కేసులో తెలంగాణ హైకోర్టు అభిప్రాయం వెల్లడించింది.
2017లో హైదరాబాదు నార్సింగిలో ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి తరువాత చంపేసిన వ్యక్తికి మరణశిక్షే విధించడం సరైనదే అని తెలంగాణ హైకోర్టు, కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది.
2017లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దినసరి వలస కూలీ అయిన దినేశ్ కుమార్ ధర్నే హైదరాబాదులో ఒక చిన్న పాపపై అత్యాచారం చేశాడు.
సదరు పాపకు చాక్లెట్లు ఇస్తాను అని ఆశ చూపి కిడ్నాప్ చేసి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తరువాతా ఆ పాప విషయం తల్లిదండ్రులకు తెలియజేస్తుందని భయపడి ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు.
కాగా, ఆ చిన్నారి తల్లిదండ్రులు బీహార్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చిన వారే. అయితే, ఈ కేసు విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడు అయిన దినేశ్ కుమార్ కు 2021లోనే ఉరిశిక్షను ఖరారు చేసింది.
దీని వల్ల, ఆ తీర్పును సవాలు చేస్తూ దినేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. కాని, తెలంగాణ హైకోర్టు అతడి విజ్ఞప్తిని నిరాకరిస్తూ, శిక్ష సబబే అని తెలిపింది.