వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ పరీక్షకు మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు హాజరవగా అందులో 51,316 మంది అర్హత సాధించడంతో ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఈ పరీక్షలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండవ ర్యాంక్ కూడా హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ కు మూడో ర్యాంకు, అలాగే హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర లు నాలుగవ ర్యాంకు సాధించి సత్తా చాటారు.
తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జరిగిన డిగ్రీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిర్వహణ కోసం షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.