హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం ద్వారా స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక అర్హత విషయానికి వస్తే డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే స్పోర్ట్స్ కోటా అర్హత కూడా సాధించి ఉండాలి. కనిష్ట వయసు 18 ఏళ్ళు, గరిష్ట వయసు 44 ఏళ్ళు ఉండాలి. కాగా రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితి విషయానికి వస్తే ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాల విషయానికి వస్తే నెలకు రూ.28,719 వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా జరుగుతుంది. కాగా రాత పరీక్షలో రెండు పేపర్లు ఉండనున్నాయి, పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021. వెబ్సైట్: https://epanchayat.telangana.gov.in/cs