హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం శాసనసభ, శాసనమండలి రెండు వేరువేరుగా సమావేశమయ్యాయి. సమావేశ ప్రారంభంలో ఇటీవల మరణించిన పలువురు శాసనసభ్యులకు సంతాపాలు పాటించారు.
తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు అజ్మీర్ చందూలాల్, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. శాసనమండలిలో రెహమాన్, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం మిద 9 మంది మాజీ సభ్యులకు ఇవాళ సభ ప్రారంభంలో సంతాపం ప్రకటించారు. అనంతరం ఉభయసభలను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
తదుపరి అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఉభయ సభల నిర్వహణ, సమావేశ తేదీలు మరియు ప్రధాన ఎజెండాల ఖరారుపై చర్చ జరిగింది. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి సమావేశలను 27వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.