హైదరాబాద్: హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన తో పాటూగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.
గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15వ తేదీన జన్మించారు. ఆయన రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీ పార్టీలో చేరారు.
అలాగే, ఆయన 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. దీనితో పాటు జిష్ణుదేవ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు.