హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇవాళ పోలీస్ నియామకాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేపట్టనుంది.
తెలంగాణ ప్రభుత్వం మొత్తం 16,027 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 414 ఉండగా, సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులు ఉన్నాయి.
కాగా ఈ నోటిఫికేషన్ కొరకు అర్హత ఉన్న అభ్యర్థులు వచ్చే నెల మే 2వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వ్వ్వ్.త్స్ల్ప్ర్బ్.ఇన్లో అభ్యర్తులు దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.