హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ ఆస్తుల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. రిజిస్ట్రేషన్ సర్వర్ లో సాంకేతిక సమస్యల కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి సేవలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ సర్వర్ కు ఆధార్ లింక్ చేయడంలో లోపం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.యూడీఐఏఐలో ఈకేవైసీ వెరిఫికేషన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్య ఉందని అధికారులు పేర్కొన్నారు.
సర్వర్ సమస్యను పరిష్కరించడానికి టెక్నికల్ బృందం సహాయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఈ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడినట్లు, సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో రేపు రావాలని అధికారులు సిఫారసు చేశారు.