హైదరాబాద్: కోవిడ్ వల్ల మూతపడ్డ తెలంగాణ పాఠశాలలను సెప్టెంబర్ 1వ తేదీ నుండి తిరిగి తెరుచుకుని ప్రత్యక్ష బోధన తరగతి గదుల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎంఈఓ ఆధ్వర్యంలో శానిటేషన్, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లోనూ రెండు రోజులుగా పరిశుభ్రతా పనులను నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రభుత్వం ఆన్‌లైన్ లో తరగతులను నిర్వహించే పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయించడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులందరూ పాఠశాలలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేస్తున్నారు. మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 14,332 మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు.