హైదరాబాద్: హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కోట్లల్లో బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ‘నిపుణ’ సంస్థ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా బిల్లులు చెల్లించమని విజ్ఞప్తి చేసినా చెల్లించకపోవడం వల్ల సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల పలు ప్రభుత్వ శాఖల సేవలు నిలిచిపోయాయి.