fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsమార్చ్ 27 న 'తెల్లవారితే గురువారం'

మార్చ్ 27 న ‘తెల్లవారితే గురువారం’

TellavaaritheGuruvaaram Movie ReleaseDateAnnounced

టాలీవుడ్: సంగీత దర్శకుడు కీరవాణి రెండవ కుమారుడు ‘శ్రీ సింహా’ మత్తు వదలరా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో తన రెండవ ప్రయత్నంగా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి కీరవాణి ఇంకో కుమారుడు ‘కాల భైరవసంగీతం అందిస్తున్నాడు. ఇలా అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఒకే సినిమాతో తమ టాలెంట్ నిరూపించుకునే పనిలో పడ్డారు. ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించింది సినిమా టీం. మార్చ్ 27 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

వారాహి చలనచిత్రం మరియు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయి కొర్రెపాటి, రజిని కొర్రెపాటి, బెనర్జీ ముప్పనేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణికాంత్ గెల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ – పెళ్లి అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందినట్టు సినిమా పోస్టర్స్ చూస్తే అర్ధం అవుతుంది. తెల్లారితే పెళ్లి పెట్టుకునే మనసులో ఉన్న అమ్మయి కోసం ఎదురు చూస్తే పాత్రలో శ్రీ సింహా లుక్స్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular