టాలీవుడ్: టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రెండవ కుమారుడు శ్రీ సింహా హీరోగా ‘మత్తు వదలరా’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఇపుడు ”తెల్లవారితే గురువారం’ అనే సినిమా ద్వారా రెండవ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాని పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లాగా రూపొందించారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తనకి పెళ్లి ఇష్టం లేదని తాను లవ్ చేసిన అమ్మాయి గురించి చెపుతుండడం టీజర్లో చూపించారు. టీజర్ లో చూపించిన సీన్స్ అన్ని హ్యూమరస్ గా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. టీజర్ లో వచ్చిన కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
మొదటి సినిమా మత్తు వదలరా లో డార్క్ హుమౌర్ కావడం వలన లుక్స్ పరంగా శ్రీ సింహా అంతగా హైలైట్ అవలేదు. కానీ ఈ సినిమాలో లుక్స్ పరంగా, డాన్స్ పరంగా, కొన్ని ఎక్సప్రెస్సన్స్, డైలాగ్ డెలివరీ లాంటి ఏరియాస్ లో ఆకట్టుకోబోతున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. వారాహి చలన చిత్రం మరియు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాకి కీరవాణి మొదటి కుమారుడు కాల భైరవ సంగీతం అందించాడు. మార్చ్ 27 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.