టాలీవుడ్: కీరవాణి రెండవ కుమారుడు ‘శ్రీ సింహ’ మత్తు వదలరా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ నటుడు హీరోగా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ వారం విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి ఈ రోజు రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధులుగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ని విడుదల చేసారు.
పెళ్లి కాబోతున్న ఒక అబ్బాయి, పెళ్లి వద్దు అనుకోని వెళ్లిపోతుండగా అనుకోకుండా పెళ్లి కూతురు వెళ్తున్న కార్ నే లిఫ్ట్ అడగడం, ఆ తర్వాత పెళ్లి కూతురుకి తన ప్రేమ కథని చెప్పడం, ఆ ట్రావెల్ లో పెళ్లి కూతురుకి, హీరో కి ఇష్టం పెరగడం లాంటివి జరగడం, ట్విస్ట్ గా పెళ్లి కూతురు ని అజయ్ అనే విలన్ ముందు నుండే ఇష్టపడడం, ఆ విషయం పై హీరో, విలన్ ఫైట్ చేయడం ఇది కథ అని ట్రైలర్ ద్వారా చూచాయగా తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో హీరో కి ఉన్న లవ్ స్టోరీ ఏంటి, చివరికి హీరో ఎవరిని వరిస్తాడు లాంటివి సినిమాలో చూడాల్సిన అంశం. ట్రైలర్ చూసాక ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది. కామెడీ పరంగా కూడా సినిమా ఆకట్టుకోబోతుందని ట్రైలర్ లో తెలుస్తుంది.
ఈ సినిమాకి కీరవాణి మొదటి కుమారుడు సంగీతం అందించాడు. ఆల్రెడీ ఈ సినిమా నుండి విడుదలైన కొన్ని పాటలు ఆకట్టుకుంటున్నాయి. వారాహి చలన చిత్రం మరియు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణికాంత్ గెల్లి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. మార్చ్ 27 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది.