fbpx
Monday, October 28, 2024
HomeInternationalఅంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి!

అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తెలుగు యువతి!

TELUGU-WOMEN-SPACE-TRAVEL-IN-VIRGIN-GALACTIC-UNITY

హైదరాబాద్‌: ఏపీ‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అనే యువతి ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బ్రాన్సన్‌ అనే అంతర్జాతీయ సంస్థ సిద్దం చేసిన ‘వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ నుండి కల్పనా చావ్లా, ఇండో‌ అమెరికన్‌ సునీతా విలయమ్స్‌ తరువాత అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ సంతతి మహిళల సరసన చేరారు. కాగా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు యువతి శిరీష కావడం ఆంధ్రకు గర్వ కారణం.

యూఎస్ కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ అనే ఒక వ్యోమనౌకను నింగిలోకి పంపనుంది. ఈ నౌకలో సదరు సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు వెళ్తారు. వారిలో ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు, తెలుగు యువతి అయిన శిరీష​ కూడా చోటు సంపాదించుకున్నారు.

రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి శిరీష హాబ్‌నాబ్ చేయడం ఒక గర్వించదగ్గ విషయమంటూ శిరీష బంధువు రామారావు కన్నెగంటి సంతోషం వ్యక్తం చేశారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ వ్యోమనౌకలో బ్రాన్సన్‌తో కలిసి ఆరుగురితో యూనిటీ 22 టెస్ట్ ఫ్లైట్ జూలై 11, గురువారం సాయంత్రం న్యూ మెక్సికో నుండి బయలు దేరుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్పేస్ ట్రావెల్ కోసం గత వారంలో వర్జిన్ గెలాక్టిక్‌ అమెరికాకు చెందిన ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుండి కావాల్సిన అనుమతులు కూడా ఈ పాటికే లభించాయి. ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. మరోవైపు అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ కూడా ఈ నెల(జూలై) 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే ముందే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం.

అయితే 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరారు తెలుగు అమ్మాయి శిరీష. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ తాను అనేక ఉన్నత పదవులను సొంతం చేసుకుంటూ ఎదిగారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన శిరీషా జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular