టాలీవుడ్: కరోనా వల్ల ఓటీటీ లు పాపులర్ అయిన తర్వాత ఓటీటీ ల కోసం కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసి విడుదల చేయడం జరుగుతుంది. ఇపుడు కొత్తగా ఆంథాలజీ సిరీస్ లు రూపొందిస్తున్నారు. అంటే వివిధ డైరెక్టర్లు వివిధ కథలని కలిపి ఒక సిరీస్ లేదా సినిమా ద్వారా ప్రెసెంట్ చేస్తారు. తమిళ్ లో ఇప్పటికి ‘పుత్తం పుదు కలై’, ‘పావ కధైగల్’ అనే రెండు ఆంథాలజీ సిరీస్ లు ఈ మధ్యనే విడుదల అయ్యి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం తెలుగులో కూడా ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. పిట్ట కథలు అనే పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ టాలీవుడ్ లో పేరు పొందిన నలుగురు డైరెక్టర్ లు రూపొందించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి లో నెట్ ఫ్లిక్ లో విడుదల చెయ్యబోతున్నారు.
ఇందులో శృతి హాసన్ ముఖ్య పాత్రలో రూపొందుతున్న ‘ఎక్స్ లైఫ్’ అనే కథకి మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతి బాబు, అమలా పాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘మీరా’ అనే కథకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా రెబ్బ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పింకీ’ అనే కథకి ‘ఘాజి’ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రాముల’ అనే కథకి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పిట్ట కథలు టీజర్ హిందీ లో రూపొందిన ‘లస్ట్ స్టోరీస్’ కి తెలుగు వెర్షన్ అని చెప్తున్నారు కానీ దీని గురించి అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు. ఆర్. ఎస్.వి.పి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సిరీస్ ని నిర్మిస్తారు. ఫిబ్రవరి 19 నుండి ఈ సిరీస్ అందరికి అందుబాటులో ఉండనుంది.