హైదరాబాద్: టెన్త్ క్లాస్ చదివిన వారికి శుభవార్త అనుకోకండి, టెన్త్ తో డాక్టర్ అవ్వచ్చు అనుకుంటే పొరపాటు. ఇది ఒక ఫేక్ డాక్టర్ కథ. చదివింది టెన్త్, చలామణి అయ్యేది మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ లాగ.
హైదరాబాద్ లోని మెహదీపట్నంకు సంబధించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి లో నకిలీ డాక్టరుగ పనిచేస్తున్న విషయం గురించి తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ నిన్న ఆసుపత్రి పై దాడి చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ముజీబ్ అనే వ్యక్తి చదివినది టెన్త్ క్లాస్ అయినప్పటికీ నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ సంపాదించి డాక్టర్ అవతారం ఎత్తాడు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ వ్యవహారం తెలుసుకుని దాడి చేశారు.
ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం నిందితులు ఇద్దరినీ అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఆ వ్యక్తి నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి పొందాడో ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.