fbpx
Saturday, January 18, 2025
HomeInternationalపాకిస్తాన్‌లో టెర్రర్ ఎటాక్‌

పాకిస్తాన్‌లో టెర్రర్ ఎటాక్‌

Terror-attack-Pakistan

అంతర్జాతీయం: పాకిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని ముసాఖైల్‌ జిల్లాలో ఘోరమైన కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు 23 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు.

ఈ ఘటనలో మరికొందరు గాయపడగా, పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘోరం ఉగ్రవాదులు ప్రయాణికులను బస్సు నుంచి బలవంతంగా దింపి, వారి గుర్తింపు పరిశీలన తర్వాత దారుణంగా కాల్చి చంపినట్లు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.

రరాషమ్ ప్రాంతంలోని అంతర్-ప్రాంతీయ రహదారిపై ఉగ్రవాదులు మోహరించి, బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

ఈ క్రమంలో పది వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారు పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.

ప్రస్తుతం ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించనప్పటికీ, ఈ ఘటన వెనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఊరికే వదలిపెట్టదు అని చెప్పారు. బలూచిస్తాన్ ప్రాంతంలో బీఎల్ఏ ఉగ్రవాదులు గతంలో కూడా పలు దాడులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular