న్యూఢిల్లీ: క్రీడాభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా-భారత్ తొలి టెస్టుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. డే అండ్ నైట్ టెస్టు కావడం, అదీ పింక్ బాల్‌తో ఆట జరగనుండటంతో ఈ మ్యాచ్‌పై చాలా ఆసక్తి నెలకొంది. అడిలైడ్ ఓవల్‌లో డిసెంబర్ 17న మొదలు కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించింది.
ఈ జాబితాలో వృద్ధిమాన్ సాహా, పృథ్వీ షా చోటు దక్కించుకోగా, వార్మప్ మ్యాచ్‌ల్లో రాణించిన రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ అనూహ్యంగా తిరిగి బెంచ్‌కే పరిమితమయ్యారు. పింక్‌బాల్‌తో డే అండ్ నైట్‌లో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో గిల్ 43, 65 పరుగులతో ఫరవాలేదని అనిపించాడు. అతని స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేయడంపై కొందరు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టెస్టుల్లో పుజారాతో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తిసాడు. అయితే, ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి భారత్‌కు తిరుగుపయనమవుతాడు. అతని భార్య అనుష్క శర్మ డెలివరీ నేపథ్యలో మిగతా టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయమ్ళొ భారత్ కు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవరిస్తాడు.
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.