fbpx
Monday, January 20, 2025
HomeInternationalటెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్ రేసులో రవిచంద్రన్ అశ్విన్!

టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్ రేసులో రవిచంద్రన్ అశ్విన్!

TESTPLAYER-OF-THE-YEAR-2021-LIST-HAS-RAVICHANDRAN-ASHWIN

దుబాయ్: టెస్టు క్రికెట్‌లో ప్రతీ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఇవ్వడం అలవాటు. కాగా 2021 సంవత్సరానికి గాను పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ఆ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమిసన్ మరియు శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ఉన్నారు.

ఈ జాబితా లో ఉన్న ప్లేయర్లలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ ఏడాది క్యాలెండర్‌ ఇయర్‌లో 15 టెస్టులాడి 1708 పరుగులు నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జో రూట్‌ చోటు దక్కించుకున్నాడు.

తరువాత ఈ జాబితాలో టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో ఈ ఏడాది అత్యద్బుత ఫామ్‌ను కనబరిచాడు. అతను ఆడినటువంటి 8 టెస్టుల్లో ఏకంగా 52 వికెట్లు తీసిన అశ్విన్‌ బ్యాటింగ్‌లోనూ 337 పరుగులు సాధించాడు. అలాగే ఈ స్కోరులో ఒక టెస్టు సెంచరీ కూడా ఉంది.

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన కైల్‌ జేమిసన్‌ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ ఏడాది కాలంలో జేమిసన్‌ ఐదు టెస్టు మ్యాచ్‌లాడి 27 వికెట్లను తీసుకున్నాడు. ముఖ్యంగా కివీస్‌ జట్టు టెస్టులో తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడంలో జేమీసన్‌ కీలకపాత్ర పోషించాడు.

శ్రీలంక కెప్టెన్‌ దిముత్ కరుణరత్నే ఈ ఏడాది టెస్టు ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఏడు మ్యాచ్‌ల్లో 902 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వరుసగా శతకాలు బాది లంక బెస్ట్‌ ఓపెనర్‌గా అవార్డు నామినేషన్‌లో చోటు దక్కించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular