కోలీవుడ్: తమిళ్ లో ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోగా ఎదుగుతున్నా కానీ ఈ మధ్యనే తుపాకీ, అదిరింది, మాస్టర్ సినిమాల ద్వారా తెలుగు లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్. తమిళ నాట ఇళయ దళపతి అని పిలవబడే ఈ హీరో ప్రస్తుతం తన 65 వ సినిమాలో నటిస్తున్నాడు. రేపు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా బీస్ట్ (అంటే మృగం) అనే టైటిల్ తో రూపొందిస్తున్నట్టు తెలిపి విజయ్ ఒక పెద్ద స్నిఫర్ గన్ పట్టుకున్న లుక్ ని విడుదల చేసారు.బీస్ట్ పోస్టర్ లో విజయ్ బాడీ అండ్ అండ్ ఆ గన్ చూస్తే ఇదొక పూర్తి యాక్షన్ ప్యాక్డ్ సినిమా అని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.
ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ కోసం జార్జియా లో చాలా రోజులు షూటింగ్ జరిపారు. ‘కో కో కోకిల’ సినిమాతో పరిచయం అయ్యి శివ కార్తికేయ తో ‘డాక్టర్’ అనే సినిమాని రూపొందించిన దిలీప్ నెల్సన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా సందర్భంగా డాక్టర్ సినిమా ఇంకా విడుదల అవలేదు. మూడవ సినిమాకే విజయ్ ని డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు ఈ కొత్త డైరెక్టర్. ఈ సినిమాకి ‘కత్తి’, ‘మాస్టర్’ సినిమాల తర్వాత మరోసారి విజయ్ తో పని చేయనున్నాడు సంగీత దర్శకుడు అనిరుద్ రవి చందర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు ఆడియో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా మంచి ఆడియో రానుందని ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ద్వారానే తెలుస్తుంది.