టాలీవుడ్: ప్రస్తుతం వరుస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న సంగీత దర్శకుడు థమన్. వరుస హిట్ లతో దూకుడు మీద ఉన్న థమన్ లాక్ డౌన్ తర్వాత విడుదలైన క్రాక్, వకీల్ సాబ్ సినిమాల సూపర్ హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. తర్వాత మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళం రీ మేక్ సినిమాలకి కూడా పని చేస్తున్నాడు. ఇలా పెద్ద సినిమాలతో పాటు టక్ జగదీశ్ లాంటి మీడియం సినిమాలు కూడా బాగానే థమన్ సంగీతం నుండి రానున్నాయి. ప్రస్తుతం థమన్ అమెరికా లో లైవ్ కన్సర్ట్ చేస్తున్నాడు, దీనికి ‘అల అమెరికా పురములో’ అనే టైటిల్ పెట్టి ప్రకటించాడు.
ఇదివరకు తమిళ సంగీత దర్శకులు ఏ.ఆర్.రహ్మాన్, అనిరుద్ రవిచందర్ వేరే దేశాల్లో చాలా కాన్సర్ట్స్ చేసారు. మన తెలుగు సంగీత దర్శకుల్లో వేరే దేశాల్లో కాన్సర్ట్స్ చేయడం చాలా అరుదు. కరోనా కి ముందు దేవి శ్రీ ప్రసాద్ కూడా అమెరికా లో ఒకటి చేసాడు. ఇపుడు అమెరికా లో వ్యాక్సినేషన్ పూర్తి అయ్యి పరిస్థితులు కుదుటపడం తో థమన్ అక్కడ ఒక లైవ్ కాన్సర్ట్ అరేంజ్ చేసారు. ఈ కాన్సర్ట్ ఎపుడు ఎక్కడ ఉండబోతుంది లాంటి వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. దీని కోసం ఒక ప్రోమో వీడియో విడుదల చేసి అందులో థమన్ ఇండస్ట్రీ హిట్స్ కి సంబందించిన సినిమా పోస్టర్స్ పెట్టి బ్యాక్ గ్రౌండ్ లో ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ని వాడారు.