fbpx
Thursday, May 8, 2025
HomeMovie Newsతమన్నా '11th అవర్' టీజర్

తమన్నా ’11th అవర్’ టీజర్

ThamannaBhatia 11thHour TeaserReleased

టాలీవుడ్: ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కేవలం కొత్త తారలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు, హీరోయిన్లు ఓటీటీ కంటెంట్ లలో నటిస్తున్నారు. సౌత్ లో ఇంకా హీరోలు ఓటీటీ బాట పట్టలేదు కానీ తెలుగు లో ఉన్న టాప్ హీరోయిన్ లు ఓటీటీ సిరీస్ లలో సినిమాల్లో నటిస్తున్నారు. కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ఈ మధ్య విడుదలైంది. ప్రస్తుతం మరో సీనియర్ హీరోయిన్ తమన్నా నటించిన ’11th అవర్’ అనే వెబ్ సిరీస్ ఆహా ఓటీటీ లో విడులవబోతుంది. ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ ఈ రోజు విడుదలైంది.

ఈ సిరీస్ లో కొన్ని అనుకోని కారణాల వలన ఒక కార్పొరేట్ కంపెనీ నడిపే బాధ్యతని తీసుకునే పాత్రలో తమన్నా నటిస్తుంది. అరాత్రికా రెడ్డి అనే పేరుతో ఉండే ఈ పాత్ర తన బిజినెస్ లో ఫ్రెండ్స్ నుండి, ఎనిమీస్ నుండి, దగ్గరి వ్యక్తుల నుండి ఆటంకాలు ఎదుర్కొంటుంది. అయినా కూడా చివరకి తాను తన బిజినెస్ ని సక్సెస్ బాట పట్టిస్తుందా లేదా అనేది ఈ సిరీస్ కథాంశం అని టీజర్ ద్వారా తెలుస్తుంది. చివర్లో వచ్చే ‘చక్రవ్యూహం లో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు క్రియేట్ చేసుకోవాలి’ అనే డైలాగ్ తో టీజర్ ముగించారు.

ఆహా లో ప్రసారం అవనున్న ఈ సిరీస్ లో తమన్నా తో పాటు ఆదిత్ అరుణ్ , జయ ప్రకాష్, శత్రు, పవిత్ర లోకేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్, ప్రియా బెనర్జీ నటిస్తున్నారు. ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్ ని గరుడవేగా, చందమామ కథలు లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసారు. ఏప్రిల్ 9 నుండి ఈ సిరీస్ ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.

11th Hour Teaser | An aha Original | Tamannaah | Praveen Sattaru | Pradeep U | Premieres April 9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular