కోలీవుడ్: టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముందుకు సాగుతున్న హీరోయిన్లు మెల్లి మెల్లిగా ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే సిరీస్ తో మొదటి వెబ్ సిరీస్ లో నటించారు. తమన్నా కూడా తెలుగు లో ’11th హావర్’ అనే వెబ్ సిరీస్ తో ‘ఆహ‘ ఓటీటీ లో పలకరించారు. ప్రస్తుతం తమన్నా నటించిన మరో వెబ్ సిరీస్ మే 14 నుండి స్ట్రీమ్ అవనుంది. తమన్నా డిస్నీ హాట్ స్టార్ వారి ఓటీటీ లో ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. చాలా రోజుల క్రితమే పూర్తి అయిన ఈ వెబ్ సిరీస్ మే 14 నుండి స్ట్రీమ్ అవనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఒక క్రైమ్ థ్రిల్లర్ బుక్స్ రాసే ఒకే ఫేమస్ రైటర్ అనుకోకుండా హత్యకు గురి అవుతాడు. అతని హత్యకి సంబందించిన ఇంటర్రోగేషన్ లో ఎలాంటి నిజాలు తెలుస్తాయి, అతని మిస్టీరియస్ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఈ సిరీస్ లో చేయబోయే ఇన్వెస్టిగేషన్ అని టీజర్ ద్వారా తెలుస్తుంది. ఆ రైటర్ కూతురిగా తమన్నా నటిస్తుంది. తన తండ్రి హత్య వెనక గల కారణాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. కానీ టీజర్ అంతా చూసిన తర్వాత మరో నవల కోసం కథ రాయడానికి ఇదంతా ప్లాన్ చేశారా అని కూడా ఒక సందేహం మొదలవుతుంది. ఏది నిజం అనేది వెబ్ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.