హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు లో ఉన్న సంగీత దర్శకులలో టాప్ పోసిషన్ లో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు థమన్. అతి తక్కువ కాలం లో దాదాపు 100 సినిమాలు చేయగలిగాడు. ఈ సంవత్సరం మొదట్లోనే ‘అల వైకుంఠపురం లో‘ సినిమా కి అద్భుత మ్యూజిక్ ఇచ్చి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం లో ముఖ్య పాత్ర పోషించాడు. అద్భుతమైన ఫార్మ్ లో ఉన్న ఈ సంగీత దర్శకుడు ప్రస్తుతం టాప్ లీగ్ సినిమాలకి సంగీతం ఇస్తున్నాడు. తెలుగు లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వాఖీల్ సాబ్’ , రవితేజ తో ‘క్రాక్’, తమిళ్ లో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న తదుపరి సినిమాకి సంగీత దర్శకత్వం చేయబోతున్నాడు. మధ్యలో థమన్ సంగీతం పై కాపీ విమర్శలు చాలా వచ్చినప్పటికీ రేస్ లో మాత్రం ఎక్కడా వెనక పడలేదు.
ఇదిలా ఉండగా ఈరోజు థమన్ తన చైల్డ్ హుడ్ మెమరీ ఒకటి ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఈ పిక్చర్ లో తనతో పాటు తమిళ్ లో క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు మరియు బాలసుబ్రమణ్యం కొడుకు S.P.చరణ్ ఉన్నారు. వారితో పాటు ఉన్న పిక్చర్ ని షేర్ చేస్తూ ‘నెక్స్ట్ జనరేషన్ పాపులర్ మ్యూజిక్ బ్యాండ్’ అని అలాగే గోల్డెన్ డేస్ అఫ్ లైఫ్ అని తన జీవితం లో ఇవే అద్భుతమైన రోజులని చెప్పుకొచ్చాడు.