మూవీడెస్క్: నాగ చైతన్య తన కెరీర్‌లో మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన తండేల్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.
చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
చైతన్య – సాయి పల్లవి జోడీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి.
కేవలం 6 రోజుల్లోనే తండేల్ బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా బలమైన కలెక్షన్లు రాబట్టింది.
యూఎస్ మార్కెట్‌లో చైతన్య మళ్లీ తన క్రేజ్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ సెంటర్లలో సాయి పల్లవి నటనకు విశేషమైన స్పందన వచ్చింది.
వాలెంటైన్స్ వీకెండ్‌లో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ థియేటర్లకు భారీగా వస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి.
తండేల్ విజయంతో చైతూ మళ్లీ తన స్టార్‌డమ్‌ను తిరిగి పొందాడు.
ఈ సినిమా సక్సెస్ నిర్మాతకు లాభాలను అందించడమే కాకుండా చైతన్యకు బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్‌గా నిలిచింది.