మూవీడెస్క్: నాగచైతన్య కెరీర్‌లోనే తండేల్ అత్యంత పెద్ద ఓపెనర్‌గా నిలిచింది. యూనిట్ నుంచి వచ్చిన పోస్టర్ ను బట్టి, ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 62.37 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
నిర్మాత బన్నీ వాస్ హామీ ఇచ్చినట్టు, వంద కోట్ల మార్కు చేరుకోవడానికి ఇంకా 37 కోట్లు కావాలి.
అయితే, వీకెండ్ తర్వాత కలెక్షన్లు ఎంత వరకు నిలబడతాయనే దానిపై సినిమా రన్ ఆధారపడి ఉంది.
ఏపీలో వారం రోజులకు టికెట్ రేట్లు పెంచిన టీమ్, ఇప్పుడు సాధారణ ధరలకు వెళ్లే ఆలోచనలో ఉంది.
నైజాంలో సినిమా బలంగా ఉంది, హైదరాబాద్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు భారీగా పడుతున్నాయి.
బుక్ మై షోలో 24 గంటల్లోనే 1.90 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం, సినిమా టాక్ పాజిటివ్‌గా వెళ్లిందని సూచిస్తోంది.
అయితే, హిందీ వెర్షన్ ఇంకా ఆశించిన స్థాయిలో పికప్ కాలేదు.
ప్యాన్ఇండియా ప్రమోషన్లు చేసినా, బాలీవుడ్‌లో ఈ సినిమాకు ప్రత్యేకంగా రీచ్ రావాల్సి ఉంది.
సముద్ర నేపథ్యం మినహాయించి, పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్ లాంటి కథాంశాలు నార్త్ ఆడియెన్స్‌కు కొత్తగా అనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
తెలుగులో తండేల్ స్పీడ్ బాగానే ఉన్నా, సోమవారం నుంచి గురువారం దాకా ఆక్యుపెన్సీలు ఎలా ఉంటాయనేదే సినిమా రేంజ్‌ను నిర్ణయించనుంది.
మరి, ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి ఎప్పుడు చేరుతుందో చూడాలి.