టాలీవుడ్: టెలివిజన్ వ్యాఖ్యాత గానే కాకుండా తన దగ్గరికి వచ్చే పాత్రల్లో మంచి మంచివి సెలెక్ట్ చేసుకుంటూ సినిమాల్లో కూడా తన ప్రత్యేకత చాటుకుంటుంది అనసూయ భరద్వాజ్. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొంది ఇపుడు మరొక కొత్త పాత్ర ద్వారా మన ముందుకు వస్తుంది. అనసూయ భరద్వాజ్ మరియు అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమా ప్రీ లుక్ ని ఈ మధ్యనే దగ్గుబాటి రానా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసారు.
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు సంపాదించిన నటుడు అశ్విన్ విరాజ్, ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్ కేవలం లిఫ్ట్ వరకు చూపించారు. ఫస్ట్ లుక్ లో లిఫ్ట్ లో ఉన్న అనసూయ ని, విరాజ్ ని చూపించారు. దీన్ని బట్టి ఈ సినిమా కథ కి లిఫ్ట్ కి ఏమైనా సంబంధం ఉండుండాలి. అంతే కాకుండా ఇది కరోనా తర్వాతి కథ అని అనసూయ చేతిలో ఉన్న మాస్క్ ని బట్టి తెలుస్తుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకునే స్టేజి లో ఉంది.