
టాలీవుడ్: కరోనా కారణంగా సినిమా విడుదలలు ఆలస్యమవుతుండడం తో చిన్న సినిమా నిర్మాతలు ఫైనాన్స్ ఇబ్బందుల్లో పడి సినిమాని ఓటీటీ లకి అమ్ముకుంటున్నారు. ఎపుడు విదలవుతుందో తెలియదు, అన్నీ కుదురుకుంటే పెద్ద సినిమాల మధ్య విడుదల తేదీ ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధంలో చిన్న సినిమాలకి మిగిలిన ఏకైన ఒప్షన్ OTT . ఈ మధ్య ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యి కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇదే బాటలో మరో చిన్న సినిమా ‘అర్ద శతాబ్దం’ కూడా వచ్చే నెలలో ఆహ ఓటీటీ లో చేరనుంది. ఇపుడు ఇంకో సినిమా ‘థాంక్ యు బ్రదర్’ అనే సినిమా కూడా ఓటీటీ లో విడుదలవనుంది.
విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ ఒక ప్రత్యేక కారెక్టర్ లో నటించింది. రానా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఫెయిల్ అయిన ఒక లిఫ్ట్ లో ఇరుక్కున్న ఒక ప్రేగ్నన్ట్ వుమన్ మరియు హీరో అందులో నుండి ఎలా బయట పడ్డారు అనే సస్పెన్స్ ఎలిమెంట్ తో ఈ సినిమా రూపొందింది. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి ఈ సినిమాని నిర్మించారు. రమేష్ రాపర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 7 నుండి ఆహ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.