టాలీవుడ్: అనసూయ ప్రధాన పాత్రలో ‘థ్యాంక్ యూ బ్రదర్’ అనే ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అనసూయ ఒక గర్భిణీ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ఇదివరకే దగ్గుబాటి రానా చేతుల మీదుగా విడుదల చేసారు. షార్ట్ మూవీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇపుడు వెండి తెర కి ఈ సినిమా ద్వారా విరాజ్ అశ్విన్ అనే నూతన నటుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కరోనా నేపధ్యం లో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు అర్ధం అవుతుంది. ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ మాస్క్ లు ధరిస్తూ ఉన్నట్టు చూపించారు.
ఈరోజు ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో లిఫ్ట్ లో స్ట్రక్ అయిన హీరోని మరియు అనసూయ ని చూపిస్తారు. పైన ఎవరైనా ఉన్నారా అని సపోర్ట్ కోసం అరుస్తున్న హీరో వాయిస్ తో లిఫ్ట్ లో స్ట్రక్ అయిన వీళ్ళిద్దరిని చూపించారు. కొంచెం రియలిస్టిక్ సీన్స్ తో సినిమా ఐతే ఇంటరెస్ట్ లెవెల్స్ ని కొంతవరకు పెంచింది అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తారక్నాథ్ బొమ్మిరిడ్డి, మాగుంట శరత్ చంద్రా రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి తొందర్లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది.