టాలీవుడ్: విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలుగా ‘థాంక్ యు బ్రదర్‘ అనే సినిమా రూపొందింది. ముందుగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేద్దాం అనుకుని విడుదల తేదీ కూడా ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేకపోవడం తో ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. మే 7 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. మరో ఏడు రోజుల్లో విడుదలవనున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఎలాంటి రెస్పాసిబిలిటీస్ లేని, తల్లి తండ్రులు, ప్రియురాల్ని పట్టించుకోని ఒక రిచ్ కుర్రాడి పాత్రలో విరాజ్ అశ్విన్ నటిస్తున్నాడు. ఒక మిడిల్ క్లాస్ యువతి పాత్రలో అనసూయ భరద్వాజ్ నటిస్తుంది. ఈ సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ వుమన్ పాత్రలో కనిపించబోతుంది. లాక్ డౌన్ సమయంలో అనుకోకుండా ఒక రెసిడెన్షియల్ టౌన్ షిప్ లో విరాజ్ మరియు అనసూయ ఇరుక్కుంటారు. లాక్ డౌన్ సమయం కావడం తో టెక్నీషియన్స్ అందుబాటుకి రావడానికి సమయం పడుతుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన భయానికి గురైన అనసూయ, ప్రెగ్నెంట్ ఉమెన్ కావడం వలన ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంటుంది, చివరకి ఎలా బయటకి వచ్చింది అనే థ్రిల్లర్ సబ్జెక్టు తో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.