టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచయం అయిన డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. ఒక పూర్తి కామెడీ మరియు డిటెక్టివ్ సినిమాని రూపొందించి కామెడీ పరంగా మరియు సీరియస్ సబ్జెక్టు పరంగా అన్ని రకాల అభిమానులని సంతృప్తి పరచేలా సినిమా రూపొందించి హిట్ సాధించాడు స్వరూప్. ప్రస్తుతం తన రెండవ ప్రయత్నంగా ‘మిషన్ ఇంపాసిబుల్ ‘ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ మధ్యనే సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాలోకి తాప్సి ని వెల్కమ్ చేసారు సినిమా టీం. తాప్సి వర్క్ కి పెద్ద ఫ్యాన్ అని ఈ సినిమాలో తాను నటించడం ఆనందంగా ఉందని తాప్సి కి సంబందించిన ఒక పిక్ ని రిలీజ్ చేసారు.
కంప్యూటర్ లో చూస్తున్న తాప్సి ని ఈ పోస్టర్ లో చూడవచ్చు. చేతికి కట్టు కట్టుకుని ఉన్న లుక్ లో తాప్సి కనిపించింది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు అభిమానులకి పరిచయం అయిన తాప్సి ఇక్కడ వరుస సినిమాలు చేసి బాలీవుడ్ లో సినిమాలు మొదలు పెట్టింది. ఇక్కడ చివరగా ‘గేమ్ ఓవర్’ అనే సినిమాలో నటించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో నటించనుంది తాప్సి. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.