హైదరాబాద్: పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక మలయాళ సినిమా గురించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. తాను చూసిన ‘కప్పెల‘ అనే సినిమా బాగుందని
‘ఇందులో హీరో గట్టిగా పిచ్చోడిలా రీసౌండ్ చేసుకుంటూ అరవడాలు ఉండవని
అందరికంటే స్మార్ట్ గా ప్రతి డైలాగ్ లో సామెతలు చెప్పడని
స్లో మోషన్లో ఫిజిక్స్ ని ఫెయిల్ చేసే ఫైట్స్ ఉండవని
ప్రతి 2 నిమిషాలకి హీరో రీ-ఎంట్రీ ఉండదని
చివరి 10 నిమిషాల్లో సంబంధం లేకుండా రైతుల గురించో, ఆర్మీ గురించో, ఇండియా గురించో మెసేజ్ ఉండదు
కాని దీన్ని కూడా సినిమా అంటారు ఆ ఊళ్ళో ‘
అని ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. దీనిపై ఒక హీరో ఫాన్స్ ఈ డైరెక్టర్ ని విపరీతం గా ట్రోల్ చేసారు. ఈ పోస్టులోని కొన్ని మాటలు ఆ హీరో చేసిన సినిమాలకి దగ్గర పోలికలు ఉండడంతో ఆ హీరో ఫాన్స్ ఆవేశంతో ఈ డైరెక్టర్ పై సోషల్ మీడియా లో దాడి చేశారు. దీనికి ప్రతి స్పందన గా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ట్రోలర్స్ పై హైదరాబాద్ సిటీ పోలీస్ కి కంప్లైంట్ పెట్టారు.కొందరు తనను తిట్టడంతో పాటు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న తరుణ్, తనను వేధించిన వారు ఫోన్ నెంబర్స్, ఐడీ నెంబర్స్‌ను పోలీసులకు ఫిర్యాదుతో పాటు అందించారు. తాను కంప్లైంట్ చేసిన విషయాన్ని కూడా తరుణ్ భాస్కర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.