fbpx
Thursday, April 3, 2025
HomeMovie Newsవెబ్ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్

వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్

TharunBhaskar Preseting NewWebSeries

టాలీవుడ్: కరోనా టైం లో ఓటీటీ లకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. కొన్ని వెబ్ సిరీస్ లు చుట్టేస్తుంటే కొన్ని వెబ్ సిరీస్ లు హిట్ టాక్ తో మంచి వ్యూస్ తెచుకుంటున్నాయి. ఇలా కొన్ని సిరీస్ లకి పెద్ద తారలు కూడా తమ వంతు సపోర్ట్ ని ఇస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నమే ఇపుడు నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేస్తున్నారు. ‘రూమ్ నంబర్ 54 ‘ అనే టైటిల్ తో రూపొందిన ఒక వెబ్ సిరీస్ కి సమర్పకుడిగా ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్నాడు.

90 ల్లో జరిగిన కథగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఒక కాలేజ్ హాస్టల్ లో జరిగే స్నేహితుల కథ ఇది అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కాలేజ్ హాస్టల్ రూమ్ నంబర్ 54 లో ఉండే నలుగురు స్నేహితుల మధ్య ప్రేమ, ఆనందం, బాధ, దుఃఖం, కస్టాలు, కన్నీళ్లు, పార్టీలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని టచ్ చేస్తూ ఈ సిరీస్ ని రూపొందించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ గాడ్జెట్స్ లేని టైం లో ఫ్రెండ్షిప్ లాంటి ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేస్తూ ఈ సిరీస్ ని రూపొందించారు. ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ రూపొందించిన వీడియో లో ‘అందరికి కాలేజ్ రోజులు మెమొరబుల్, ఇపుడున్న కరోనా టైం లో అందరూ కాలేజ్ ని మిస్ అవుతున్నారు, ఈ సిరీస్ చూసి కొంత రిలీఫ్ పొందండి.. చాలా మందికి పాత రోజుల్ని గుర్తుకు తెస్తాయి’ అని తరుణ్ భాస్కర్ తెలిపారు. ఈ సిరీస్ మే 21 నుండి zee5 ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.

Room No. 54 | Official Trailer | Tharun Bhascker | A ZEE5 Exclusive | Premieres 21st May on ZEE5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular