మూవీడెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం గురించి ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది.
మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ కొత్తగా కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముగ్గురు కథానాయికలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ పాత్రలు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదని సమాచారం.
ప్రస్తుతానికి 80 రోజుల వర్క్ పెండింగ్‌లో ఉండగా, మ్యూజిక్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పూర్తి కావాల్సి ఉంది.
చిత్ర బృందం విడుదల తేదీగా ఏప్రిల్ 10ని అనుకున్నప్పటికీ, ఈ టైమ్‌లో సినిమాను సిద్ధం చేయడం కష్టసాధ్యమని తెలుస్తోంది.
మేకర్స్ సినిమాను జూన్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే పెండింగ్ వర్క్ కోసం ఇంకా చాలా సమయం కావాల్సి వస్తోంది.
మారుతి ప్రత్యేకంగా ప్రభాస్ కోసం హారర్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీర్చిదిద్దుతున్నారు.
ప్రభాస్ అభిమానులు ‘ది రాజా సాబ్’పై చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఇది ప్రభాస్‌కు మరో హిట్‌ను అందించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక విడుదల తేదీపై క్లారిటీ కోసం వేచి చూడాలి.