ఆరు నెలల ముందు లాక్ డౌన్ విధించినప్పటినుండి మూసివేయబడింది థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అన్ లాక్ ప్రక్రియ లో భాగం గా కేంద్ర ప్రభుత్వం ఒక్కో రంగం లో మెల్లగా సడలింపులతో విధులు నిర్వహించుకొమ్మని వెసులుబాటు కల్పించింది కానీ ఇప్పటివరకు థియేటర్ ల పైన ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అన్ లాక్ 5.0 లో భాగం గా థియేటర్లు ముల్టీప్లెక్సులు తెరచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతి కల్పించింది.
అయితే థియేటర్ ఒక్క్యూపెన్సీ 50 శాతం వరకే ఉండేలా చూసుకోవాలని నిబంధన విధించింది. ఇక థియేటర్ లు ఎలాగు తెరుచుకుంటాయి కాబట్టి మెల్లిగా సినిమాలు కూడా విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. థియేటర్ ఓపెన్ అవుతాయా లేదా ఓటీటీ ల్లో విడుదల చెయ్యాలా అనే మీమాంస లో ఉన్న చాలా మంది ప్రొడ్యూసర్స్ కి ఇది శుభ వార్త. అయితే కంటెయిన్మెంట్ జోన్ లలో మాత్రం ఎలాంటి సడలింపులు లేవని కేంద్రం ప్రకటించింది. అన్ లాక్ 5.0 లో భాగం గా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూ పార్కులను కూడా తెరిచేందుకు అనుమతి లభించింది.అక్టోబర్ 15 తర్వాత కేవలం క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాల మధ్య అన్ని రకాల రాకపోకలను అనుమతిస్తున్నామని.. ఎలాంటి షరతులు విధించవద్దని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది