టాలీవుడ్: మనిషి మూలాలు, మానవ మనుగడకి, జీవన విధానానికి బాటలు వేసిన ఆదిమ మానవుడికి సంబందించిన కథ తో ఒక అడ్వెంచరస్ మూవీ గా ‘ది బర్త్ 10000 BC ‘ అనే సినిమా రూపొందింది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మామూలుగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో హాలీవుడ్ సినిమా అనిపిస్తుంది. కానీ టెక్నిషియన్స్ మేకర్స్ చూసాక ఇది పక్కా ఇండియన్ సినిమా అని తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. కానీ ఇండియన్ మేకింగ్ లో ఇదే మొదటిది.
ట్రైలర్ లో మనిషి మనుగడ, అప్పటి పరిస్థితుల్లో మనిషి ఎలా బ్రతకగలిగాడు, ఎలాంటి పరిణామాలని ఎదుర్కొన్నాడు, ప్రకృతి లాంటి అంశాలను చాలా వరకే కవర్ చేసాడు. తిండి కోసం ఆ మానవుడు సాగించిన వేట చేసిన అడ్వెంచర్స్ లాంటివి సినిమాలో చూపించబోతున్నట్టు అర్ధం అవుతుంది. ముఖ్యం గా ట్రైలర్ లో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సుందరేశ. ఈయన అందించిన విజువల్స్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో నిలబెట్టాయి. శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్ – లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన తెలుగు ట్రైలర్ ని సాయి దారం తేజ్ విడుదల చేసారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ , మలయాళం ఇలా ఆరు భాషల్లో విడుదల చేయనున్నారు.