న్యూఢిల్లీ: 2020 మార్చిలో మొదలైన కరోనా తొలిదశ నుండి దేశంలో కేసులు తగ్గుతూ పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. కాగా ప్రజలు కొంత మెలకువతో మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ కాస్త నియంత్రణలోనే ఉన్నట్లు కనిపించింది. ఆ తరువాత ప్రజల్లో ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం ఆవహించడం వల్ల రెండో వేవ్‌కు పరిస్థితులు దారితీసాయు. ఆ పరిస్థితి ఇప్పటికి కూడా మరనట్లు పరిస్థితి కనిపిస్తోంది.
దీని వల్ల చాలా రోజులు ఇళ్ళకే పరిమితమైన జనం ఇప్పుడిప్పుడే తిరిగి బయటకు రావడం ప్రారంభించారు. ఇందువల్ల పరిస్థితులు మళ్ళీ ప్రమాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారికి సంబంధించి క్లిష్టదశలో ఉన్నామని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు ఒకేలా లేవన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కరోనా మూడో వేవ్ ఈ పాటికే మొదలై ఉండొచ్చని అన్నారు. కాగా కరోనా నియంత్రణకు కేవలం వ్యాక్సినేషన్ కీలకమని, దేశంలో 70, 80 శాతం మందికి టీకాలు పూర్తయే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని సూచించారు.
ప్రజలు తప్పకుండా మాస్కులు ధిరించడం భౌతికదూరం పాటించడం ఇండ్లు ఆఫీసులు ఇతర చోట్ల గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూసుకోవడం కూడా కీలకమన్నది గుర్తుంచుకోవాలని తెలిపారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్ మహమ్మారి గుర్తు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండలన్నారు.
అయితే దేశం మొత్తం మీద మూడో వేవ్ ఒకే విధంగా వస్తుందనడానికి వీలు లేదన్నారు. వైరస్ ఒకసారి కాకుండా దశల వారిగా దాడి చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెండో వేవ్ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. మూడో వేవ్ మాత్రం కొన్నిచోట్ల ముందుగానే ఈ పాటికి మొదలైందని, చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదని భావించాల్సి ఉంటుందన్నారు.