టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లు తెరచుకుని చివరి వారం రెండు సినిమాలు విడుదలయ్యాయి. సత్యదేవ్ తిమ్మరుసు పరవాలేదనిపించినా కానీ తేజ సజ్జ ‘ఇష్క్’ మాత్రం అస్సలు నిలబడలేకపోయింది. జనాలు కూడా ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు రావడం లేదు. ఈ క్రమం లో థియేటర్ లు తెరుచుకున్న రెండవ వారంలో చిన్న సినిమాల సందడి మొదలైంది. ఈ వారం దాదాపు ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి.
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది SR కల్యాణమండపం. ‘రాజా వారు రాణి గారు’ సినిమా ద్వారా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా, సాయికుమార్ ముఖ్య పాత్రలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యి ట్రైలర్ కూడా మంచి ఆసక్తి ని క్రియేట్ చేయగలిగింది. హిట్ అవడానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ప్రొమోషన్ కూడా బాగానే చేయడం తో ఈ వారం లో విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమాకే కొంచెం మంచి బజ్ ఉంది అని చెప్పవచ్చు.
ఈ సినిమాతో పాటు ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ అనే అడల్ట్-రొమాంటిక్ ఎంటర్టైనర్, ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే కామెడీ మూవీ, ‘మెరిసే మెరిసే’ అనే లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ‘MAD ‘ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లాంటి చిన్న సినిమాలు ఈ వారం థియేటర్ లలో విడుదల అవుతున్నాయి. అసలు ఈ సినిమాలు విడుదల అవుతున్నట్టు కూడా తెలియకుండా మినిమం ప్రొమోషన్ లేకుండా విడుదల చేస్తున్నారు. మరి రేపు సినిమా బయటకి వచ్చాక టాక్ చూస్తే గాని ఏది హిట్ ఏది ప్లాప్ అనే విషయం తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎంతో కొంత పెద్ద సినిమా విడుదల అయితే తప్ప జనాలు థియేటర్లకు వచ్చేటట్టు కనపడడం లేదు.