ఈ వారం నాలుగు సినిమాలు.. ఎవరు హిట్ కొడతారో?
ఏప్రిల్ రెండో వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాల పోటీ మొదలైంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సన్నీ డియోల్ జాట్, యాంకర్ ప్రదీప్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు ఒక్కోటి ఒక్కో రేంజ్‌లో ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.
టిల్లు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న జాక్ మూవీ టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్నప్పటికీ, గ్రౌండ్ బజ్ పరంగా సాధారణ స్థాయిలోనే ఉంది. బుక్ మై షో ట్రెండింగ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం ఒక హెచ్చరికే. టాక్ బాగుంటే మాత్రమే ఇది నిలదొక్కుకునే అవకాశముంది.
అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడులో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నా, తెలుగులో మాత్రం అతడి గత సినిమాల ఫలితాలు మళ్లీ అనుమానాల వాతావరణం తీసుకొచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నా, ముందుగా పాజిటివ్ టాక్ అవసరం.
జాట్ చిత్రానికి గోపీచంద్ మలినేని వంటి టెక్నికల్ బలమైన టీమ్ ఉన్నా, తెలుగు డబ్బింగ్ లేకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మాత్రం కామెడీ కంటెంట్‌తో చాన్స్ కొట్టేందుకు రెడీగా ఉంది.
మొత్తానికి ఈ వారపు నాలుగు సినిమాల్లో ఎవరు హైప్‌ను క్యాష్ చేసుకుంటారు? ఎవరి టాక్ వర్కౌట్ అవుతుంది? అన్నది వారం చివరికి తేలనుంది.