fbpx
Thursday, November 21, 2024
HomeTelanganaఅప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య!

Three-people-in-the-same-family-committed-suicide-due-to-debt

తెలంగాణ: నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధను తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్ (53), ఆయన భార్య హేమలత (45), కొడుకు హరీష్ (22)గా గుర్తించారు. ఈ దారుణం స్థానికులను విషాదంలోకి నెట్టింది.

వివరాలలోకి వెళితే..
పోలీసుల సమాచారం ప్రకారం, సురేశ్ కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ, చివరకు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్స్ ఆడటం ప్రారంభించడంతో అప్పులు కొండలా పెరిగిపోయాయి. అప్పు తీర్చేందుకు సురేశ్ దంపతులు పొలం కూడా తెగనమ్మారు. కానీ అప్పుల భారం తగ్గకపోవడంతో, ముగ్గురు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో వడ్డేపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular