జాతీయం: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ నుంచి పెద్ద షాక్. ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 700 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మలేషియాలోని ఉద్యోగులతో పాటు ఇతర దేశాల వారిని కూడా ఈ నిర్ణయం ప్రభావితమైంది. టిక్‌టాక్ ఉద్యోగుల లేఆఫ్ ప్రక్రియను తమ AI సాంకేతికత అభివృద్ధి కోసం చేపట్టినట్లు పేర్కొంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులకు ఈ-మెయిల్ రూపంలో లేఆఫ్ సమాచారం అందినట్లు తెలుస్తోంది.
టిక్‌టాక్ ప్రతినిధి ఈ ఉద్యోగుల తొలగింపును కన్ఫార్మ్ చేసినప్పటికీ, సంస్థ ఎంతమందిని తొలగించిందో ఖచ్చితంగా వెల్లడించలేదు. కంపెనీ వ్యూహాత్మక చర్యలలో భాగంగా ఈ లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయని తెలిపారు. కంటెంట్ మోడరేషన్ కోసం గ్లోబల్ ఆపరేషన్ మోడల్‌ను బలోపేతం చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు టిక్‌టాక్ వివరించింది.
ఇది మొదటిసారి కాదు, ఈ ఏడాది మేలో కూడా టిక్‌టాక్ 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా కంటెంట్ మరియు మార్కెటింగ్ విభాగాలకు చెందిన వారిని తొలగించారు. మరో రౌండ్ ఉద్యోగుల తొలగింపు త్వరలోనే చేపట్టనున్నట్లు సమాచారం.
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.