ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో తిలక్ వర్మ కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించగా, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి టాప్-5లో చోటు సంపాదించాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. రెండో టీ20లో అతడు అజేయంగా 72 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు.
ఈ ప్రదర్శనతో 832 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 25 స్థానాలు మెరుగుపర్చుకుని 5వ స్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుణ్ మెరుగైన ప్రదర్శన అందించడంతో 679 రేటింగ్ పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 718 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.