fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshకలియుగ దైవం కొలువైన తిరుమలలో ఆగస్టు మాసంలో విశేష ఉత్సవాలు

కలియుగ దైవం కొలువైన తిరుమలలో ఆగస్టు మాసంలో విశేష ఉత్సవాలు

TIRUMALA-August-month-programs

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం కొలువైన తిరుమలలో ఆగస్టు మాసంలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగిస్తాయి.

ఆగస్టు 4: చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం. ఈ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 7: ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ఆగస్టు 9: గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ. ఈ రోజు భక్తుల కోసం ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు.

ఆగస్టు 10: కల్కి జయంతి.

ఆగస్టు 13: తరిగొండ వెంగమాంబ వర్ధంతి.

ఆగస్టు 14: తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.

ఆగస్టు 15: భారత స్వాతంత్య్ర దినోత్సవం, స్మార్త ఏకాదశి.

ఆగస్టు 15-17: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.

ఆగస్టు 16: వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం.

ఆగస్టు 19: శ్రావణపౌర్ణమి, పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖనస మహాముని జయంతి.

ఆగస్టు 20: తిరుమల శ్రీవారు విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ జపం.

ఆగస్టు 27: శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.

ఆగస్టు 28: శ్రీవారి శిక్యోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ పర్వదినాల సందర్భంగా టీటీడీ భక్తులకు విశేష సేవలు అందించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేసింది. ఆగస్టు మాసంలో తిరుమల దర్శనంతో పుణ్యం పొందాలని భక్తులను టీటీడీ ఆహ్వానిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular