తిరుపతి: కలియుగ దైవం ఐన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయైమన తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభం అయిన నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పడుతోంది.
టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 8 గంటలు పడుతోంది. సర్వ దర్శనానికి వచ్చిన భక్తులతో దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఉన్నాయి. కాగా ఇటీవల దర్శనం కోసం క్యూ లైన్ల ఉన్న వారికి, మరియు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నూతన ఈఓ శ్యామాలారావు ఆదేశించారు.